కామరెడ్డి, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్ హాజరై మాట్లాడారు.
ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని పాఠశాలకు మూడు మండలాలు ఐదు గ్రామాల విద్యార్థులు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాకమిటీకి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులు, అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిని అభివృద్ధి పరిచి అతి తక్కువ సమయంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చిన విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావుకి, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి, ఇన్చార్జి ఉపసర్పంచ్ చాకలి బాలయ్య, మండల విద్యాశాఖాధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, హెచ్‌ఎం, విజయలక్ష్మి , తల్లిదండ్రులు అంకం సుధాకర్, శ్రీను, ఉపాధ్యాయులు అనురాధ, విద్యా వాలంటీర్లు భాగ్య, శ్రీలత, కారోబార్ సోపన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.