కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.