కామారెడ్డి, జూన్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ మధురానగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా మూడేండ్ల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, (మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి) శ్రీలత పేర్కొన్నారు.
సివిల్ ఇంజనీరింగ్ (డిఈసి), ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిఈఈఈ), కంప్యూటర్ ఇంజనీరింగ్ (డిసిఎంఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (డిసిఈసి) లో కోర్సులు చేయడానికి విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని, ఒక్కో కోర్సులో 60 సీట్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. అనాధలకు, పాక్షిక అనాధలకు, పేదవారికి, చెందిన బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వారికోసం 70 శాతం సీట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఒక్కో కోర్సులో 42 సీట్లు వీరికి కేటాయించబడ్డాయని, రూల్ ఆప్ రిజర్వేషన్ ప్రకారం 30 శాతం సీట్లు కేటాయించబడుతాయని ఆమె తెలిపారు. తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాయకపోయినా విద్య సంవత్సరం 2021-2022 లో 10 వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20 లోపు కుల, ఆదాయ సర్టిఫికెట్లు బోనఫైడ్ సర్టిఫికేట్స్, టీసీ, స్టడీ సర్టిఫికేట్స్, పదవ తరగతి మెమో, అనాధ (అనాథలకు ఆదాయ మరియు కుల పత్రాలు అవసరం లేదు), పాక్షిక అనాధులు వారి తల్లిదండ్రులు డెత్ సర్టిఫికేట్లు జత చేసి బాల రక్ష భవన్, వివేకానంద కాలనీ, ప్రియ టాకిస్ రోడ్, కామారెడ్డి కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు.