కామారెడ్డి, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్‌లో ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు.
గ్రామస్థాయిలో గర్భిణీల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. కుష్టు వ్యాధి రాకుండా గ్రామీణులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు శోభారాణి, శిరీష, వేణుగోపాల్, వైద్యులు పాల్గొన్నారు.