దోమకొండ, జూన్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరానికి ముంబైలో స్థిరపడిన దోమకొండ గ్రామానికి చెందిన అందే శంకర్ ప్రమీల దంపతులు మంగళవారం రూ. 25 లక్షల విలువగల 460 గజాల భూమిని మార్కండేయ పద్మశాలి సంఘానికి విరాళంగా అందజేశారు. ఇంటింటికి మార్కండేయుడు కార్యక్రమంలో భాగంగా వారు భూమిని ఆలయ అధ్యక్షుడు ఐరేని నరసయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల సమక్షంలో విరాళంగా అందజేశారు.
దీనిని రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు ఐరెని నర్సయ్యకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి మ్యాక నాగరాజు, కోశాధికారి బత్తిని సిద్ధరాములు, సహాయ కార్యదర్శి దీకొండ శంకర్, పాండి దారులు, చింతల అంజయ్య, అందే లింగం, నరసయ్య, మహదేవ్, దేవశేట్టి చింతల లింగం తదితరులు పాల్గొన్నారు.