కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో పౌష్టికాహార లోపం లేని చిన్నారులు ఉన్న జిల్లాగా గుర్తింపు తీసుకురావడానికి ఐసిడిఎస్, పోషణ అభియాన్ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం పర్యవేక్షణతో కూడిన అనుబంధ కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
అంగన్‌వాడి కేంద్రాల్లో వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలను గుర్తించి అదనంగా పౌష్టికాహారం అందే విధంగా చూడాలన్నారు. ప్రతి నెల పిల్లల బరువు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. పౌష్టికాహారం గర్భిణీలకు, చిన్నారులకు సక్రమంగా అందేవిధంగా పర్యవేక్షణ అధికారులు చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, శిక్షకుడు నరసింహారావు, సిడిపివోలు అనురాధ, శ్రీలత, పారిజాత పాల్గొన్నారు.