కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణం పనులను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.