కామారెడ్డి, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని సిహెచ్సిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.
సిబ్బంది హాజరు పట్టికను చూశారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ అనిల్ కుమార్, సర్పంచ్ సురేష్, వైద్యాధికారి ఆనంద్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.