కామరెడ్డి, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదవ విడత పల్లె ప్రగతి లో 10,743 కిలోమీటర్ల పొడవు రోడ్లు శుభ్రపరిచారు. మురుగు కాలువలు 1338 కిలోమీటర్ల పొడవు పూడిక మట్టిని తొలగించి శుభ్రం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. 526 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వీటిలో 60,790 మంది ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు 2999 శుభ్రం చేశారు. 633 శిథిలావస్థలో ఉన్న గృహాలను తొలగించారు. 2202 ప్రభుత్వ స్థలాలలో పిచ్చి మొక్కలు తొలగించారు. రోడ్డు మధ్యలో ఉన్న 1061 గుంతలను పూడిచారు.
240 మ్యాజిక్ సోఫీట్లు, 50 కమ్యూనిటీ సోఫీట్లు నిర్మించారు. 70 బోర్వెల్ గుంతలు పూడిచారు. అన్ని గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లింగంపేటలోని నాగన్న బావిలో శ్రమదానం చేశారు. స్వచ్ఛందంగా స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు, ప్రజలు భాగస్వాములు అయ్యారు.