మోర్తాడ్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రం శివారులోని 63వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కదే మృతి చెందడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని మోర్తాడ్ ఎస్ఐ ముత్యం రాజు తెలిపారు.
ఎస్ఐ వివరాల ప్రకారం జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు హెరిటీగ వాహనం నెంబరు టిఎస్ 21 జి 1919 లో నిజామాబాద్ వైపు వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్ల కారు చెట్టుకు ఢీకొనడంతో సందీప్ (45) అక్కడికక్కడే మృతి చెందాదని, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించి, గాయాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు.