డిచ్‌పల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా జూన్, 21 వ తేదీ మంగళవారం నుంచి జూలై 12 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటలా జరుగుతాయన్నారు. మొత్తం 36 సెంటర్స్, 8 రూట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. రెగ్యూలర్ థియరీ పరీక్షలకు రెండవ సెమిస్టర్‌లో 11823, నాల్గవ సెమిస్టర్‌లో 10180, ఆరవ సెమిస్టర్‌లో 7974 మంది, మొత్తంగా 29877 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్ లో 11509, మూడవ సెమిస్టర్ లో 7936, ఐదవ సెమిస్టర్ లో 3502 మంది, మొత్తంగా 22947 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
అన్ని పరీక్షా కేంద్రాలకు రూట్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్‌ను నియామకం చేశామని అన్నారు. కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్స్‌కు మెటీరియల్ అందించామని, పరీక్షల నిర్వహణకు వారంతా సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కావున పరీక్షలు రాసే అభ్యర్థులు అర్థ గంట ముందుగానే ఆయా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్స్, ఐడి ఫ్రూప్ తెచ్చుకోవాలని, మాస్క్ తప్పని సరిగా ధరించాలని, అవసరమైతే వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.