నిజామాబాద్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలనువిన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, ప్రజావాణి సైట్లో వివరాలను అప్లోడ్ చేయాలని, చేపట్టిన చర్యల గురించి అర్జీదారులకు సమాచారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఆర్డీవో రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.