డిచ్పల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో రేపు అనగా 21 వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు యోగాసనాలు నిర్వహింపబడుతాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య డి. రవీందర్, విశిష్ట అతిథిగా ఆచార్య కె. శివశంకర్, ప్రముఖ యోగా గురువు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. కావున అధిక సంఖ్యలో క్యాంపస్ విద్యార్థులు హాజరు కావాలని వారు కోరారు.
ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాబర్లో సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఇందులో రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ఆచార్య ఎం. అరుణ, డా. రాంబాబు, డా. కె. రవీందర్ రెడ్డి, పీఆర్ఓ డా. త్రివేణి, పిడి నేతా, జూనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.