డిచ్‌పల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని తరగతులను సోమవారం ఉదయం పర్యవేక్షించారు.
తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, బాటనీ, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, బయో టెక్నాలజీ వంటి విభాగాలలో జరుగుతున్న తరగతులను వీసీ సందర్శించారు. విభాగాల వారిగా అటెండెన్స్ రిజిస్టర్స్, అకడమిక్ డైరీలను తనిఖీ చేశారు. తరగతులలో విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా ప్రతి అధ్యాపకుడు శ్రద్ధ వహించాలని అన్నారు.
విభాగాల వారిగా మౌలిక వసతుల ఏర్పాటు కోసం విభాగాధిపతులు తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొత్త సెలబస్ రూప కల్పన చేయాలని విభాగాల చైర్ పర్సన్స్ కు సూచించారు. తరగతులు తిరుగుతూ విద్యార్థులను ఆప్యాయంగా పలుకరించారు. వీసీ వెంట ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. ఆరతి, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి, ఎఇ వినోద్ కుమార్, సూపరింటెండెంట్ ఉమాదేవి తదితరులు ఉన్నారు.