ఆర్మూర్, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణానికి చెందిన తలారి హరీష్‌కు వారం కింద గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన హరీష్‌ను హైదరాబాద్‌లోని భృంగి హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు.
అక్కడ వైద్యులు సూచనల మేరకు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అందుకు చాలా ఖర్చుతో కూడుకున్నదని బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమాచారం తెలుసుకున్న మిత్రులు యూత్ ఆర్మూర్ సభ్యులు లక్ష యాబై వేల రూపాయలు సమకూర్చి సోమవారం ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా తన మిత్రుడు హరీష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలు ఫ్రెండ్స్ యూత్ సభ్యులను అభినందిచారు.