పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి

కామారెడ్డి, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల ఆవరణలో బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) ఆధ్వర్యంలో బడిబాట సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికవసతులపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రతినిధులు లక్ష్మీపతి, ఆంజనేయులు, రాజశేఖర్‌, భాస్కరాచారి,టి. భాస్కర్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »