కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ యూనిట్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ప్రతి వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవించాలంటే యోగ ఉత్తమమైన సాధనం అన్నారు. మంచి ఆలోచనలు రావడానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించి శాలువాలతో సన్మానించారు.
అదనపు కలెక్టర్ వెంకటే ధోత్రే, ఆర్‌డిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కే. శ్రీనివాసరావు వివిధ రకాల ఆసనాలు చేశారు. నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు రామ్ రెడ్డి, అంజయ్య, సిద్దా గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, నగేష్, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.