అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా ఆపరేషన్‌

నిజామాబాద్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరుదైన క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచకిత్స చేసిన నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అత్యంత అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచకిత్స చేసిన జిల్లా ఆసుపత్రి వైద్యుల బృందానికి, సూపరింటెండేంట్‌ ప్రతిమరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్‌ దేశంలోనే రెండోది. ప్రపంచ వ్యాప్తంగా 20వది. కేసిఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వ ఆసుపత్రులు పేదల కోసం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ఈ సంఘటనే నిదర్శనం అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »