కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం సందర్శించారు.
క్షయ వ్యాధి పరీక్ష నిర్ధారణ రిజిస్టర్ పరిశీలించారు. వైద్య సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైద్యురాలు సాయి సింధును ఓపీ నుంచి క్షయ అనుమానిత లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి నిర్ధారణ పరీక్ష కొరకు ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు.