కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చాలని నేషనల్ టుబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం క్షయ వ్యాధి నియంత్రణపై పర్యవేక్షణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2025 నాటికి క్షయ వ్యాధిని అంతమొందించే దిశగా పర్యవేక్షకులు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చిన నోడల్ సూపర్వైజర్ లతో క్షయ అంతమొందించే దిశగా చేయవలసిన దిశ, నిర్దేశాలను వివరించారు. క్షయ లక్షణాలు దగ్గు, ఆకలి లేకపోవడం, ఆయాసం, తేమడ రావడం, బరువు తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయని చెప్పారు. క్షయ నిర్ధారణ ఐతే రోగికి ఆరునెలలపాటు ప్రతినెల పౌష్టికాహారం కోసం ఖాతాలో 500 రూపాయలు జమ చేస్తామన్నారు.
రోగి యొక్క చికిత్స కాలం పూర్తయ్యే వరకు మూడువేల రూపాయలు జమ చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యా ధికారులు ఇదిరిచ్ గోరీ, నీలిమ, రవికుమార్, సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.