నిజామాబాద్, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న రిటైర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జులై 15న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు ఉద్యోగుల సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ తీర్మానించింది. శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో శాస్త్రిల దత్తాత్రేయ రావు అధ్యక్షత వహించగా పలు తీర్మానాలు చేశారు.
ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలని, ప్రతి నెల మొదటి తారీకునే పెన్షన్ చెల్లించాలని, ఈ కుబేర్‌లో పెండిరగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండిరగ్లో ఉన్న డి.ఏ.లను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేటు ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
398 రూపాయలతో పనిచేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చాలని వారు కోరారు. సంవత్సర కాలంగా పెండిరగ్లో ఉన్న మెడికల్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, నగదు రహిత వైద్యం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్‌లో, కార్పొరేట్ ఆస్పత్రులలో అనుమతించాలని కోరారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు ప్రసాద్, ముత్తారం, సుదర్శన్ రాజు, ఈ.వి.ఎల్. నారాయణ, బేబీ డివిజన్ అధ్యక్షులు హనుమాన్లు, హమీద్ ఉద్దీన్, సీర్ప లింగయ్య ,రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.