డిచ్‌పల్లి, జూన్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల కోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాగా వివిధ సాంకేతిక కారణాల వల్ల భీంగల్లులో నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహింపబడుతున్న పరీక్షా కేంద్రాన్ని (5019) మార్పు చేసి భీంగల్లులోనే గల ప్రభుత్వ డిగ్రీ కళాడాలలో పరీక్షా కేంద్రాన్ని (5007) నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున నలందా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థులు సోమవారం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో రాయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా శనివారం ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 6241 నమోదు చేసుకోగా 5983 మంది హాజరు, 258 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 5115 నమోదు చేసుకోగా 4950 మంది హాజరు, 165 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.