కామారెడ్డి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం కింద డెఈరీ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఇతర రాష్ట్రాల్లో గేదెలను కొనుగోలు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దళిత దళిత బంధు పథకం కింద వాహనాలు తీసుకున్న లబ్ధిదారులకు ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ చంద్రమోహన్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ఆర్టీవో వాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.