నిజామాబాద్, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు.
నూతన కార్యవర్గాన్ని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. 50 శాతం రాయితీ ఇప్పించేందుకు కృషి చేస్తానని వెంటనే సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు వార్తల సేకరణతో పాటు ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. కలెక్టం ను కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బైర శేఖర్, ప్రధాన కార్యదర్శి రాజలింగం, కోశాధికారి సందీప్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.