కామారెడ్డి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులకు పూర్తిస్థాయిలో సంసిద్ధులు కావడానికి అవసరమైన ఉచిత శిక్షణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రణాళిక బద్ధమైన సాధన చేస్తే ఉద్యోగం సాధించడం సులువుతుందని చెప్పారు. శిక్షణలో భాగంగా వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి విషయ నిపుణులు ఇచ్చే శిక్షణతో పాటు మెళుకువలు పాటించి, ఉద్యోగ ప్రయత్నంలో అందరూ విజయం సాధించాలని కోరారు.
ఇష్టపడి చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రజిత, జిల్లా షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి అంబాజీ, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.