డిచ్పల్లి, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 32 నమోదు చేసుకోగా 32 మంది హాజరు, ఎవరు గైర్హాజరు కాలేదని తెలిపారు.