నిజామాబాద్, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో మే నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం రెండవ సంవత్సరం విద్యార్థులు 15,742 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,372 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 65 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
అలాగే మొదటి సంవత్సరంలో మొత్తం 15,360 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,974 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 శాతం ఉత్తీర్ణత సాధించారని, అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 2,190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 946 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 43 శాతం సాధించారని తెలిపారు.
అలాగే ఒకేషనల్ రెండో సంవత్సరంలో మొత్తం 2,008 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,036 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ మాట్లాడుతూ జిల్లాలో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని అన్నారు. ఫలితాలలో బాలికలదే పై చేయిగా ఉందన్నారు. రెండవ సంవత్సరంలో బాలురు 55 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలికలు 74 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అలాగే మొదటి సంవత్సరం లో బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 47 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు.
అలాగే ఒకేషనల్ లో రెండవ సంవత్సరం విద్యార్థినిలు 69 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 43 శాతం ఉత్తీర్ణత సాధించారని అలాగే మొదటి సంవత్సరంలో బాలికలు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 34 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గత మూడు సంవత్సరాల ఫలితాలతో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలిపారు.