కామారెడ్డి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో మంగళవారం రెడ్‌క్రాస్, ఐవిఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో భాగంగా 28 యూనిట్ల రక్తాన్ని అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టియు వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ గుప్తా మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా రక్త దానం గొప్పదని, కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, 23 సార్లు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ను అభినందించారు. టేక్రియాల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బ్యాగులను, పుస్తకాలను పంపిణీ చేశారు.
రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందజేస్తున్న రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును అభినందించారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తా, కోశాధికారి లక్ష్మీరాజ్యం గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్, కార్యదర్శి రాజన్న, రఘు కుమార్, జిల్లా సమన్వయకర్త బాలు, డివిజన్ కార్యదర్శి జమీల్ అహ్మద్, డాక్టర్ శ్రీనివాస్ రక్తదాతలు శ్రీకాంత్ రెడ్డి, సురేష్ రెడ్డి, కిరణ్, మయూరి పటేల్ శివకృష్ణ, నాగ సాయి, గంగాధర్, నరేందర్, అనిల్ గౌడ్, ఉమేష్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.