డిచ్‌పల్లి, జూన్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7166 నమోదు చేసుకోగా 6851 మంది హాజరు, 315 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 6128 నమోదు చేసుకోగా 5920 మంది హాజరు, 208 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
కామారెడ్డిలోని ఆర్‌కె డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో ఇద్దరు, నిజామాబాద్ సిఎస్‌ఐ డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో ఎఫ్‌ఐటి సబ్జెక్ట్ లో ఇద్దరు, బిజినెస్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్‌లో ఇద్దరు, నిజామాబాద్ నిశితా డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో బిజినెస్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్‌లో ఒకరు మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ప్రకటించారు.