ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉత్తమ ఫలితాలు

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరంలో నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు మంచి ఫలితాలతో తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపల్‌ నుసరత్‌ జహాన్‌ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా స్థాయిలో తమ కళాశాల బాలికలు మంచి మార్కులు సాధించారని ప్రిన్సిపల్‌ వివరించారు.

రెండవ సంవత్సరంలో ఎంపీసీ ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని కుమారి వైష్ణవి 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించారని, అలాగే బైపిసి ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థిని కుమారి అఫ్రీన్‌ 915 మార్కులు సాధించిందని తెలిపారు. సి.ఈ.సి.లో ఉర్దూ మీడియం విద్యార్థిని నిమరః తబుసం 829 మార్కులు సాధించారని హెచ్‌.ఈ.సి. లో తెలుగు మీడియం పి. కళ్యాణి 755 మార్కులు సాధించారని, అలాగే ఒకేషనల్‌ వృత్తి విద్యా కోర్సుల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో వెయ్యి మార్కులకు గాను 929 మార్కులతో జి.భవాని మొదటి స్థానంలో ఉన్నారని, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రూప్‌లో వెయ్యి మార్కులకు 925 మార్కులు సౌమ్య సాధించిందని ప్రిన్సిపల్‌ తెలిపారు.

అలాగే మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎం.పి.హెచ్‌.డబ్ల్యూ.) లో ప్రవళిక 918 మార్కులు సాధించారని, ఆఫీస్‌ అసిస్టెంట్‌ షిప్‌ గ్రూపులో కే.నందిని 886 మార్కులు, అలాగే కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీలో వై.అలేఖ్య 882 మార్కులు సాధించారని ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. అలాగే మొదటి సంవత్సరంలో కళాశాలలో ఉర్దూ మీడియం ఎమ్‌.పి. సి. విద్యార్థిని కుమారి తష్ప పర్వీన్‌ 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్‌ అన్నారు.

అలాగే తమ కళాశాలలో బీ.పి.సీ. ఇంగ్లీష్‌ మీడియంలో 440 కి గాను 407 మార్కులు దీప్తి సాధించిందని, సి.ఈ .సి. లో ఎన్‌. రమ్యశ్రీ 500 మార్కులకుగాను 381 మార్కులు సాధించి సాధించినదని, హెచ్‌.ఈ.సి. గ్రూప్‌లో మీనాక్షి తెలుగు మీడియం విద్యార్థిని 500 లకు గాను 453 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ చెప్పారు. అలాగే మొదటి సంవత్సరం ఒకేషనల్‌ వృత్తివిద్య కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని అక్షయ 500 మార్కులకుగాను 450 మార్కులు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ షిప్‌ గ్రూప్‌లో 500 లకు 452 మార్కులు సాధించారని, అలాగే మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎం.పి. హెచ్‌.డబ్ల్యూ.ఎఫ్‌.) లో 500 మార్కులకుగాను 450 మార్కులు, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ గ్రూప్‌ లో 500 లకు 447 మార్కులను సాధించారని అలాగే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రూప్‌లో 500 లకు 429 మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో అన్ని సౌకర్యాలతో పాటు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, స్కాలర్షిప్‌, బస్‌ పాస్‌ సౌకర్యం కల్పిస్తున్నామని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్‌ తీసుకొని భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కళాశాలలో విద్యార్థులకు కేవలం విద్యాబోధన కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, సెమినార్లు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగిన సృజనాత్మక శక్తిని బయటకు తీస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా తమ కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారని తెలిపారు.

తమ కళాశాలలో తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియం, ఉర్దూ మీడియంలలో ఎంపీసీ, బైపీసీ, సి.ఈ.సి. హెచ్‌.ఈ.సి. గ్రూప్‌లతో పాటు వృత్తి విద్య కోర్సులు కంప్యూటర్‌ సైన్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ షిప్‌, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ , మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కమర్షియల్‌ గవర్నమెంట్‌ టెక్నాలజీ గ్రూపులలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. పేద, బడుగు,బలహీన, మైనారిటీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »