ఆరుగురు విద్యార్థుల డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు.

ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 10534 నమోదు చేసుకోగా 9695 మంది హాజరు, 839 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14370 నమోదు చేసుకోగా 13277 మంది హాజరు, 1093 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

నిజమాబాద్‌ సిఎస్‌ఐ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో ఫిజిక్స్‌లో ఒకరు, ఎకనామిక్స్‌లో ఒకరు, కామారెడ్డిలోని ఆర్‌కె డ్రిగ్రీ కళాశాలలో గల పరీక్షా కేంద్రంలో ఎకనామిక్స్‌లో ఒకరు, ఆడిటింగ్‌లో ఒకరు, ఫిజిక్స్‌ లో ఒకరు, బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల పరీక్షా కేంద్రంలో కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌లో ఒకరు మాల్‌ ప్రాక్టిస్‌ కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు ప్రకటించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 సోమవారం, నవంబరు 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »