ఆర్మూర్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు.
గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కోర్టు రుజువులు సాక్షాధారాలుగా ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా గంజాయి నివారణకు పోలీస్ యంత్రాంగం సర్వశక్తులు పనిచేస్తుందని అన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యులను హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలని దీంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన వారవుతారని వివరించారు.
ఆదర్శ గ్రామం అంకాపూర్ సందర్శించడం ఆనందంగా ఉందని సిపి సంతోషం వ్యక్తంచేసారు. ఇదిలా ఉంటే దేశంలోనే పేరు పొందిన అంకాపూర్‌లో ఇంత పెద్ద కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ హాజరు కాకపోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ మారా రంగారెడ్డి మాట్లాడుతూ, ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామంలో నేరాలు తగ్గుముఖం పడతాయని గ్రామస్తులు ఐకమత్యంతోనే గ్రామ అభివృద్ధి తోడ్పాటు అయిందని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా పేరుగాంచిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనంతరం సీపీని గ్రామ కమిటీ అధ్యక్షులు సంగారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఏసిపి రాయల ప్రభాకర్. ఉపసర్పంచ్ కిషోర్ రెడ్డి, ఎంపిటిసిలు గంగారెడ్డి. మహేందేర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.