బోధన్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నియంత్రించాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశారత్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు.
జూలై నుంచి ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ప్లాస్టిక్ వస్తువులు క్యారీ బ్యాగులుతయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక ముందు నుండి ఒకసారి వాడి పడేసే క్యారీ బ్యాగ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని సూచించారు. ప్రజలు కూడా ఇట్టి విషయాన్ని వ్యాపారస్తులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఎసై శంకర్, మున్సిపల్ అధికారులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.