నిజామాబాద్, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాలలో 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే పాలిసెట్ ` 2022 పరీక్షకు 7008 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా సమన్వయ కర్త శ్రీరాం కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 11 గంటల తరువాత ఎట్టి పరిస్థితిలో లోనికి అనుమతించబడరని స్పష్టం చేశారు.
విద్యార్థులు ఎస్‌బిటిఈటి టిఎస్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని పాలిసెట్ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ద్వారా నేరుగా తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ వెంట పాలిసెట్ హాల్‌టికెట్, హెచ్‌బి పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్, ఎరేజర్ తీసుకురావాలన్నారు.
ఇప్పటి వరకు హాల్‌టికెట్లు అందని విద్యార్థులు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, క్యాలుకులేటర్, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవన్నారు. విద్యార్థులు విధిగా మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.