నిజామాబాద్, జూన్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్ ఎయిర్ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి ఈనెల 27వ తేదీన ‘గల్ఫ్ ఏర్’ ప్లయిట్ జిఎఫ్-275 ద్వారా హైదరాబాద్ నుండి బహరేన్కు వెళ్ళాడు. ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు.
సహాయం కోసం యువకుడి తండ్రి మోజీరాం స్థానిక నాయకుడు పట్కూరి తిరుపతి రెడ్డిని సంప్రదించాడు. విషయం తెలిసిన టిపిసిసి ఎన్నారై సెల్ – గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి… యువకున్ని రక్షించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి, ఇండియన్ ఎంబసీ, తెలంగాణ సిఎంఓ, ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.