నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా కవి, విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీ 39 వ వర్ధంతి సందర్భంగా ప్రజాసంఘాల (ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్, పివైఎల్) ఆధ్వర్యంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా కార్యాలయం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ శ్రీశ్రీ సాంప్రదాయ కవిత్వాన్ని బద్దలు కొట్టి, ప్రజా …
Read More »Monthly Archives: June 2022
సర్కారు బడికి జడ్జి కూతురు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలే ప్రతిభాపాటవాలకు,ఉన్నతమైన చదువులకు, మేధా సంపత్తి గల ఉపాధ్యాయులకు అత్యుత్తమ విద్యాలయాలని నిరూపించారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, ప్రియాంక జాదవ్ దంపతులు. వీరిద్దరి ఐదేళ్ల కూతురు అంబికా జాదవ్‌ను నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో బుధవారం ప్రవేశపత్రం నింపి జాయిన్ చేశారు. ఈ …
Read More »ఆలయానికి భూమి విరాళం
దోమకొండ, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరానికి ముంబైలో స్థిరపడిన దోమకొండ గ్రామానికి చెందిన అందే శంకర్ ప్రమీల దంపతులు మంగళవారం రూ. 25 లక్షల విలువగల 460 గజాల భూమిని మార్కండేయ పద్మశాలి సంఘానికి విరాళంగా అందజేశారు. ఇంటింటికి మార్కండేయుడు కార్యక్రమంలో భాగంగా వారు భూమిని ఆలయ అధ్యక్షుడు ఐరేని నరసయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల సమక్షంలో …
Read More »డబుల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర నుండి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పూర్తి నాణ్యతతో పనులు జరగాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే విధంగా భీంగల్ మండలం దేవక్క …
Read More »విధుల నిర్వహణ కోసం అటెండెన్స్ యాప్‌తోనే హాజరు
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిధిలోకి వచ్చే వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న ఉద్దేశ్యంతోనే అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇక ముందు కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అటెండెన్స్ యాప్ ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం వైద్యారోగ్య …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి మార్పు కనిపించాలి
జక్రాన్‌పల్లి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె …
Read More »గురుకుల పాఠశాల తనిఖీ
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు వివరాలను ప్రిన్సిపల్ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చూడాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
Read More »నిజామాబాద్ రెడ్ క్రాస్‌కు అవార్డుల పంట
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగ హైదరాబాద్ రాజ్ భవన్ కమ్యూనిటి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాదుకు చెందిన పలువురికి అవార్డులు వరించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ప్రపంచ పండుగ అని గవర్నర్ డా.తమిళి సై అన్నారు. మనకు తెలవని వారి ముఖంలో కూడ సంతోషం నింపేది రక్తదానం అన్నారు. తన కేర్ డిగ్రీ కళాశాల ద్వారా …
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి
భీమ్‌గల్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మి నరసింహాస్వామి గుడి దగ్గర్లో అర్బన్ ఫారెస్ట్ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. అర్బన్ పార్కుకు సంబంధించిన …
Read More »డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ మధురానగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా మూడేండ్ల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి, (మహిళా, పిల్లల, వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి) శ్రీలత పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ (డిఈసి), ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిఈఈఈ), కంప్యూటర్ …
Read More »