కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్.కె. డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాల ప్రజలకు మన జిల్లా యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. …
Read More »Monthly Archives: June 2022
కేంద్ర మంత్రిని కలిసిన న్యాయవాదులు
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండేను నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల నిఖిల్ సాయి హాల్లో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ ఆనంద్, ప్రధాన …
Read More »హరితహారానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఆశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై హరితహారం అమలుపై దిశా నిర్దేశం చేశారు. రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురియనున్న దృష్ట్యా …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …
Read More »జిల్లా జనరల్ ఆసుపత్రి తనిఖీ, కలెక్టర్ అసంతృప్తి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 18న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు జిల్లా పర్యటనకు హాజరవుతున్న సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో వృద్ధుల కోసం సుమారు 50 లక్షల రూపాయలను వెచ్చిస్తూ నూతనంగా నెలకొల్పిన ‘ఆలన’ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే స్కిల్ …
Read More »ఆరేపల్లిలో బడిబాట
కామరెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రామస్వామి, సెక్టోరియల్ అధికారులు గంగ కిషన్, శ్రీపతి, వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. ఆరేపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని …
Read More »డయల్ 100 సిబ్బందికి అభినందన
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముగ్గురి ప్రాణాలను కాపాడిన డయల్ 100 సిబ్బందిని అభినందిస్తూ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ నాగరాజు ప్రశంసించారు. 9వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో డయల్ 100 కు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదుకు సత్వరమే స్పందించి నిజామాబాద్ రైల్వే స్టేషన్ యందు వరంగల్ జిల్లాకు చెందిన సుమలత (40), శ్రీనిఖీ (14), శ్రీహిత (10) లు ఇంట్లో …
Read More »బస్సు చార్జీలు తగ్గించాలి
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో శివాజీనగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజిల్ ధరల పెంపును సాకుగా చూపి రెండుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచిందన్నారు. ఇప్పుడు …
Read More »ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …
Read More »నవీపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నవీపేట్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుస ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనుల తీరును, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను నిశితంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నవీపేట మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపుర్‌లో గల మండల పరిషత్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను, తడగాం కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను …
Read More »