నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటికీ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలో వైఎస్‌ఆర్ టీపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల గుండెల్లో రాజన్న బ్రతికే ఉన్నారని, ప్రజల్లో రాజన్న కుటుంబంపై విశ్వసనీయత ఉందని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, నినమాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినెటర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. రాజన్న కుటుంబానికి మాట …
Read More »Monthly Archives: June 2022
క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 6వ డివిజన్ వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనిలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చదువులొనే కాకుండా శారీరకంగా మానసికంగా దృడంగా ఉండటానికి క్రీడా ప్రాంగణాలని నిర్మిస్తున్నామని, ఇందులో వాలిబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, కబడ్డీ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు కాలనీ …
Read More »8న ప్రజా చేరువ కార్యక్రమం
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు కామారెడ్డి లీడ్ బ్యాంక్ మేనేజర్ చిందం రమేశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా చేరువ కార్యక్రమాన్ని స్థానిక శుభం కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని …
Read More »కామారెడ్డిలో జాబ్ మేళా
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 10న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు లో గల రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి ఎస్. …
Read More »టూరిజం స్పాట్‌గా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియా
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై పై అంశం పై చర్చించారు. టూరిజం అభివృద్ధి సంస్థతో పాటు, అటవీ అభివృద్ధి సంస్థ …
Read More »ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. అదేవిధంగా 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో …
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ తహసిల్దార్ కార్యాలయంను సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూడాలని తహసీల్దార్ వెంకట్ రావుకు సూచించారు.
Read More »భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కె.ఆర్. నాగరాజు ఉత్తర్వుల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్స్‌పెక్టర్ వెంకటేశం, సిబ్బంది 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పూలాంగ్‌లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, పొగాకు డంప్ ఉందన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సుమారు లక్ష రూపాయల విలువగల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకొని స్టేషన్‌లో అప్పగించారు. నిందితుని వివరాలు : షేక్ …
Read More »లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ వారు బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు 20 సీట్లు కేటాయించారు. మూడో …
Read More »పట్టణ ప్రగతి పనుల పరిశీలన
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. అయ్యప్ప నగర్లోని పలు రోడ్లు సందర్శించారు. వ్యాపార సమస్తల ముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.
Read More »