Monthly Archives: June 2022

ఫలించిన చర్చలు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్‌, ట్రై పిల్లర్‌, క్లర్క్స్‌ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుజరాతి …

Read More »

ప్రసవాలు జరుగని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జీతాలు నిలుపుదల చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం లేకపోయినా సిజీరియన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో నూటికి నూరు శాతం సీజీరియన్‌ కాన్పులే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో …

Read More »

పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల ఆవరణలో బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) ఆధ్వర్యంలో బడిబాట సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని …

Read More »

వంద శాతం పంట రుణాలు అందించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం బ్యాంక్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4778 కోట్లకు ఇప్పటికి రూ.3442 కోట్లు రుణ వితరణ చేసి …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 8 వేల …

Read More »

ముస్తాబవుతున్న సర్కారు బడులు సరే… పాఠ్య పుస్తకాల జాడేదీ…?

నిజాంసాగర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా మే నెలలోనే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటాయి. కానీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ముద్రణ కాక గోదాంలోకి చేరలేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు సక్రమంగా నడవని విషయం తెలిసిందే. ఈ సారి సకాలంలో స్కూళ్లు తెరుస్తున్నపటికి విద్యాబోధనకు …

Read More »

వర్షపు నీటిని సంరక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం కేంద్రీయ భూగర్భజల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడు …

Read More »

చిన్నాపూర్‌ పార్కును సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో గల చిన్నాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, సోలార్‌ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు …

Read More »

బాబాయ్‌కు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల …

Read More »

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, ఆరోగ్య రక్ష, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, జిల్లా యువజన, క్రీడలు, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »