కామారెడ్డి, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రమదానం చేశారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఎండిపోయిన చోట మొక్కలను నాటారు. మొక్కలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
సమీపంలోని కలెక్టరేట్ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జులై 14 లోపు కలెక్టరేట్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని కోరారు. పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించే విధంగా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాసరావు, డిఎల్‌పిఓ సాయి బాబా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.