శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండిరచి లాభాలు పొందండి…

నందిపేట్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు. శాస్త్ర వేత్తలు మాట్లాడుతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని చేయాలని రైతులకు తెలిపారు.

శాస్త్రవేత్తల, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి లాభలు ఆర్జించాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూర్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఎస్‌.నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటలైన వరి సోయా చిక్కుడు, పసుపు పంటలలో రైతులు శాస్త్రవేత్తల, వ్యవసాయ శాఖ అధికారుల శాస్త్రీయ పద్ధతులను అవలంబించి వాటిలో ఎరువులు అలాగే కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే లాభదాయకమైన పంట దిగుబడులు సాధించవచ్చు అని వివరించారు.

అలాగే మనకు ఎరువుల వడకాన్ని తగ్గించుకుని సేంద్రీయ, పచ్చి రొట్ట ఎరువులు అయిన జనుము జీలుగ వరికి ముందు వేసుకుని భూమిలో కలియదున్నుకున్నట్లయితే నత్రజని ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. జిల్లాలోని వ్యవసాయ పొలాల్లో భాస్వరం నిలవలు అధికంగా ఉన్నందువల్ల ఫాస్ఫరస్‌ సాల్బులైజింగ్‌ బ్యాక్టీరియా వినియోగాన్ని రైతులు పెంచాలని అలాగే బాస్‌ఫర్‌ ఎరువులు వాడకాన్ని తగ్గించి సాగు ఖర్చుని తగ్గించుకోవాలని సూచించారు.

సమతుల్య ఎరువుల యాజమాన్యం చేపట్టి సేంద్రీయ అలాగే రసాయన ఎరువులు తగు మోతాదులో వేసుకొని పసుపు పంటను పండిరచినట్లయితే ఖర్చు ఆదా చేసుకోవడమే గాక నాణ్యమైన తెగుళ్ల రహిత పసుపు పంటను రైతులు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఏడిఏ విజయలక్ష్మి, ఎంపీపీ వాకిడి సంతోష్‌ రెడ్డి, వ్యవసాయ అధికారి జ్యోత్స్నా భవాని, టిఆర్‌ఎస్‌ నాయకులు సాయిరెడ్డి, కొత్తూరు బాబు రాజ్‌, ఆరు క్లస్టర్ల ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »