కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేబీస్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో యాంటీ రేబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ఈ సంవత్సరం ప్రభుత్వం ద్వారా రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేసినట్లు తెలిపారు.3,800 డోస్‌లు జిల్లాకు వచ్చాయని చెప్పారు. రేబిస్ అనే వ్యాధి వైరస్ వల్ల వస్తుందని సూచించారు. ఇది సోకితే మరణం తప్ప చికిత్స లేదని పేర్కొన్నారు. కుక్కల నుంచి మానవులకు ఈ వ్యాధి సోకే వీలుందని తెలిపారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, కౌన్సిలర్ మానస, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథ చారి, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్, శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ దేవేందర్, రమేష్, రవి కిరణ్, అనిల్ రెడ్డి, పాల్గొన్నారు.