త్వరలో కారుణ్య నియామకాలు

నిజామాబాద్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి త్వరలోనే కారుణ్య నియామకాల ద్వారా 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడిరచారు. శుక్రవారం నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుమల బస్సులను ప్రారంభించారు. అనంతరం చైర్మన్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ టిఎస్‌ ఆర్‌టిసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1016 నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌టిసికి చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలు త్వరలో చెల్లించడం జరుగుతుందని ఆయన వెల్లడిరచారు.

ప్రభుత్వం తమ సంస్థకు అన్నదండలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. తిరుమల దర్శనం కోసం ప్రతిరోజు వెయ్యి మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్‌ చేసే అవకాశం ఆర్టీసీ కల్పిస్తుందని చైర్మన్‌ వివరించారు. ఆర్టీసీ అధికారులు 8 సంవత్సరాలు కష్టపడ్డ దక్కని అవకాశం ఇప్పుడు తాను చైర్మెన్‌గా కొనసాగుతున్న సమయంలో టీటీడీ బోర్డు అద్భుతమైన అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి కార్పొరేట్‌ ఆసుపత్రులు మించిపోయే విధంగా ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. నర్సింగ్‌ కళాశాలను సైతం తార్నాక ఆసుపత్రిలో ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ సంస్థ సిబ్బందికి అన్ని విధాలుగా అండగా ఉంటూ అతి త్వరలోనే పెండిరగ్లో ఉన్న బకాయిలన్నింటిని సిఎం సహకారంతో చెల్లిస్తామని వెల్లడిరచారు. సిఎం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థకు బడ్జెట్లో పదిహేను వందల కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో నుండి బయటకు వస్తుంది ప్రతిరోజు 15 నుండి 18 కోట్ల ఆదాయం వస్తుందని చైర్మన్‌ గోవర్ధన్‌ వెల్లడిరచారు.

ఆర్టీసీ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే సందర్భంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుందని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో బస్సులో మహిళలు డెలివరీ జరిగినట్లయితే ఆ నవజాత శిశువుకు జీవిత కాలం ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అతి త్వరలోనే ఫార్మసీలను కూడా ప్రారంభిస్తామని అయనన్నారు. కార్గో సర్వీసు ద్వారా వినియోగదారులకు విశేషమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

అనంతరం నిజామాబాద్‌ నగర ప్రధాన బస్టాండులో ఉన్న స్టాళ్లను ఆయన పరిశీలించారు, బస్టాండులో ఉన్న మూత్రశాలలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రపరచి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల్లో నుండి బయటకు వస్తుంది ప్రజలందరి సహకారం ఆర్టిసి సంస్థకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌, జిల్లా పరిషత్‌ ఆర్థిక, ప్రణాళిక సభ్యులు జడ్పిటిసి ధర్పల్లి బాజిరెడ్డి జగన్మోహన్‌, ఐడిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబార్‌ మోహన్‌, నిజామాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, అధికారులు ఆర్టీసీ ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »