కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల సంరక్షణ, హరితహారం కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలని సూచించారు.
వచ్చే హరితహారంలో అటవీ భూములు అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, డిఎఫ్వో నిఖిత, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.