కామారెడ్డి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే రుణాలను నూతన వ్యాపారాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు.

సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళలకు పాలు పితికే యంత్రాలు, తేనెటీగల పెంపకం కోసం రుణాలు వాడుకునే విధంగా అధికారులు చూడాలని కోరారు. మహిళలు ఆర్థిక స్వలంబన సాధించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్‌డిఓ సాయిన్న, అడిషనల్ డిఆర్‌డిఓ మురళీకృష్ణ, డిపిఎంలు రవీందర్రావు, సుధాకర్, రమేష్ బాబు, వకుల, అధికారులు పాల్గొన్నారు.