నవీపేట్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామములో గల పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.