నవీపేట్, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని నాళేశ్వర్ ప్రధాన మాటు కాలువ సమస్య రైతులకి తలనొప్పిగా మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంకాగానే వరద నీరు కారణంగా సుమారుగా 50 ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకి మాటుకాలువ సమస్యపై విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు.
మాటు కాలువ తెగిన సమయంలో 50 ఎకరాల్లో నాటిన వరి కొట్టుకుపోవడం జరుగుతుందన్నారు. మాటు కాలువకి నాళేశ్వర్ గ్రామ పరిసరప్రాంతాలు ఆనుకోని ఉండడం వల్ల కొన్ని ప్రదేశాలలో వరద నీళ్లు సైతం రావడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ సరిన్ పేర్కొన్నారు. ఇకనైనా అధికారయంత్రాంగం కాలువ మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.