బోధన్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు మూలమైన సాలురా అంతర్రాష్ట్ర మంజీర నది ఉగ్రరూపం దాల్చుతూంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు.
ఇందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. సాలూర వంతెన నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. మంజీర నది నీటి ప్రవాహం తగ్గుముఖం పడితే తప్ప ప్రయాణీకులకు ఇబ్బందులు పోవని చెప్పవచ్చు. అందరు సురక్షితంగా ఉండాలంటే కొద్ది రోజుల పాటు ప్రజలు సహకరించవలసి ఉంటుందని పోలీసులు, అధికార యంత్రాంగం కోరారు. మహారాష్ట్ర నుంచి ప్రయాణికులు అత్యవసరమైతే తెలంగాణకు రావాలంటే కందకుర్తి లేదా ధర్మాబాద్ బాసర నుండి రావచ్చని తెలిపారు. వర్షాలు తగ్గి నీటికి ప్రవాహం తగ్గుముఖం పట్టేంతవరకు సాలూర బ్రిడ్జ్ నిలిపివేయబడి ఉంటుందని తెలిపారు.