కామారెడ్డి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన శ్రీధర్‌కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనల మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు,మహిళల కోసం ఎల్లవేళలా రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, కుటుంబ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్లయితే 9492874006 నెంబర్‌కి సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చందన్, రాజు, నవీన్, సతీష్ తదితరులున్నారు.