కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలంలో గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు అందజేసిన టర్పాలిన్లు, హైజినిక్ కిట్లను నష్టపోయిన వారికి శుకవ్రారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సూచనల మేరకు రెడ్ క్రాస్ బృందాలు వివిధ గ్రామాల్లో ఇల్లు కోల్పోయిన వారికి సహాయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా చైర్మన్ రాజన్న పేర్కొన్నారు.
శివాయిపల్లి, గుండారం ఎల్లారెడ్డిపేట తండా, ఆర్గొండ గ్రామాల్లోని బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త బాలు, రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్, కార్యదర్శి రమేష్ రెడ్డి, జమీల్, రాజంపేట చైర్మన్, కార్యదర్శి హరినాథ్, ప్రసాద్, సభ్యులు సాయిలు, శివాయిపల్లి సర్పంచ్ విట్టల్ రెడ్డి, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.